కదులుతున్న రైలు ఎక్కుతూ పడిపోయిన మహిళ.. తర్వాత? - టాటానగర్ రైల్వే స్టేషన్
Constable Saves Female Passenger: వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికురాలు పట్టు జారి పడిపోయింది. అక్కడే ఉన్న ఓ మహిళా రైల్వే పోలీసు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కాపాడింది. ఈ సంఘటన ఝార్ఖండ్ జంషెద్పుర్లోని టాటానగర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ను అధికారులు అభినందించారు.