రెండు లారీలు ఢీ.. పేలిన డీజిల్ ట్యాంక్.. ముగ్గురు సజీవదహనం - రాజస్థాన్‌లో లారీలు ఢీకొని మంటలు
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొట్టుకోవడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటన జోధ్‌పుర్‌లోని షేర్ఘడ్లో పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి 11 గంటలకు జరిగింది. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను ఆర్పివేశాయని పోలీసులు తెలిపారు.
Last Updated : Jul 5, 2022, 11:47 AM IST