Yellow Frogs: పసుపుపచ్చ కప్పలు మీరెప్పుడైనా చూశారా ! - yellow frogs found at ap
కప్పలు అరిస్తే వర్షాలు పడతాయన్నది కొందరి విశ్వాసం. అయితే ఏపీలోని కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం కురిస్తే కప్పలు బయటకొస్తాయి. అవి కూడా సాధారణమైనవి కావు... ఇండియన్ బుల్ ఫ్రాగ్ జాతికి చెందిన అరుదైన రకం. మోపిదేవి మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి భూమిలో నుంచి ఈ పసుపు పచ్చ కప్పలు బయటకొచ్చాయి. వర్షాకాలం ఆరంభంలో ఇలా పసుపు రంగులోకి మారతాయని... ఒకట్రెండు రోజులు కనిపించి మళ్లీ భూమిలోకి వెళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు.