Viral Video: 18 అడుగుల పైథాన్.. గ్రామస్థులు హడల్ - laksar python
Python Video: ఉత్తరాఖండ్ లక్సర్లోని లాల్పుర్ గ్రామంలో 18 అడుగుల పైథాన్ గ్రామస్థులను హడలెత్తించింది. రోజూలాగే పొలానికి వెళ్లిన ఉదయ్ సింగ్ అనే రైతు బోరుబావి వద్ధ భారీ కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అక్కడి రైతులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కొన్ని గంటల పాటు శ్రమించి పైథాన్ను సంచిలో బంధించారు. అనంతరం అడవిలో వదిలిపెట్టారు. దాని బరువు 60 కేజీలు ఉంటుందని చెప్పారు. ఈ భారీ పైథాన్ను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. దాన్ని దగ్గరి నుంచి చూసి హడలెత్తిపోయారు.
Last Updated : Jun 29, 2022, 6:02 PM IST