ఆ ఆరు నెలలు నరకం, నొప్పిని భరిస్తూనే ఆట - alitho saradaga Pv sindhu loveletters
PV Sindhu Marriage proposal స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. తాను ఎదుర్కొన్న టఫెస్ట్ ప్లేయర్, ఆమె తనను ఎలా రెచ్చగొట్టిందో వివరించింది. ఆసియా ఛాంపియన్షిప్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్ 2.. అకానె యమగూచితో జరిగిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. ఇంకా తన లవ్లెటర్స్, పెళ్లి విషయమై కూడా మాట్లాడింది. గతంలో తాను గాయపడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆమె ఆ సమయంలో భవిష్యత్ గురించి బాగా ఆలోచించినట్లు పేర్కొంది.