తెలంగాణ

telangana

ETV Bharat / videos

క్లాస్​రూంలో మందు కొడుతూ ప్రొఫెసర్ డ్యాన్స్​.. వీడియో వైరల్​ - పంజాబ్​ లేటెస్ట్ న్యూస్

By

Published : Sep 21, 2022, 2:33 PM IST

Updated : Sep 21, 2022, 4:22 PM IST

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. తరగతి గదిలోనే మద్యం తాగుతూ చిందులేశాడు. పంజాబ్‌ పఠాన్‌కోట్‌ లోని జీఎన్​డీయూ కళాశాలలో ఈ ఘటన జరగగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సదరు వ్యక్తి కళాశాలలో గణిత ఆచార్యునిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత డబ్బులతో మద్యం తాగుతున్నానని, తనను ఎవరూ ప్రశ్నించలేరని ఆయన వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డు అయింది. అంతేగాక ఓ సినీ గీతాన్ని ఆలపిస్తూ నృత్యం చేయడం కనిపించింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌ కావడం వల్ల సదరు ప్రొఫెసర్ స్పందించాడు. తాను ఆ సమయంలో మద్యం తాగలేదని, తాగినట్లు నటించానని పేర్కొన్నాడు. అదంతా సరదాగా చేసినట్లు చెప్పుకొచ్చాడు.
Last Updated : Sep 21, 2022, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details