'Jr.NTR కోసం హరికృష్ణ ఫోన్ చేశారు.. లేదంటే ఆ సూపర్ హిట్ మూవీలో వేరే హీరో!' - ashwini dutt daughters
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'స్టూడెంట్ నంబర్ 1' సినిమాలో ప్రభాస్‌ను హీరోగా పెడదామని తొలుత అనుకున్నట్లు వెల్లడించారు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. నందమూరి హరికృష్ణ ఫోన్ చేశాక జూనియర్ ఎన్టీఆర్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఆయన.. చలనచిత్ర నిర్మాతగా తన అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. సినీ పరిశ్రమపై ఓటీటీల ప్రభావం సహా ఇండస్ట్రీలోని ఇతర సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పూర్తి ఎపిసోడ్ సోమవారం రాత్రి 9.30కి ప్రసారం కానుంది.