ఫుల్‌గా మందు కొట్టిన హెడ్ మాస్టర్.. తూలుతూ పాఠశాలకు..
ఝూర్ఖండ్ దుమ్కాలో ఓ ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తన ఉపాధ్యాయ వృత్తికే మచ్చగా మారింది. షికారిపాడు బ్లాక్‌లోని దర్బార్పుర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు ఆండ్రియాస్ మరాండి. ఆయన గురువారం ఉదయం 11 గంటలకు ఫుల్‌గా మద్యం తాగి.. తూగుతూ పాఠశాలకు వచ్చాడు. అతడిని గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. ప్రిన్సిపల్ తూలుతూ వస్తున్న దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో వారు మరాండిపై విచారణకు ఆదేశించారు.