Pratidhwani: నవ దంపతుల మధ్య పెరుగుతున్న వివాదాలు.. తరుణోపాయమేంటి? - నవ దంపతుల మధ్య పెరుగుతున్న వివాదాలు ప్రతిధ్వని
జీవితాంతం ఒకరికొకరు తోడూనీడగా నిలవాల్సిన వైవాహిక సంబంధాలు కొత్త దంపతుల్లో మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. కరోనా సృష్టించిన ఆర్థిక సమస్యలు నవతరం దంపతుల్లో చిచ్చులు రేపుతున్నాయి. చిన్న కుటుంబాల్లో ఎవరికివారే అన్నట్లుగా సాగుతున్న అతి స్వేచ్ఛ, చిన్నచిన్న విషయాలకే క్షణికావేశాలకు లోను కావడం భార్య-భర్తల మధ్య అవాంఛనీయ ఘర్షణలకు కారణమవుతున్నాయి. ఫలితంగా పచ్చని సంసారాల్లో మంటలు రేగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దంపతుల మధ్య వివాదాలను చల్లార్చడంలో మహిళా పోలీస్ స్టేషన్లు, కౌన్సిలింగ్ సెంటర్లు ఆపద్భాందవుల్లా నిలుస్తున్నాయి. ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
TAGGED:
ప్రతిధ్వని తాజా వార్తలు