Pratidwani: తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం ఎందుకింత భారమయ్యింది? - Telangana news
Pratidwani: అప్పుల భారంలో కూరుకుపోయిన రైతు కుటుంబాలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన గణాంకాల ప్రకటన ఇది. పంటల దిగుబడిలో, వ్యవసాయ పరిజ్ఞానం వినియోగంలో ముందు వరుసలో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో రైతు కుటుంబాలు పీకల్లోతు అప్పుల్లో మునిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం. అపార జలవనరులు, సారవంతమైన నేలలు ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయం ఎందుకు భారంగా మారింది? బ్యాంకులు ప్రకటిస్తున్న రుణప్రణాళికలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న మార్కెటింగ్ విధానాలు రైతుల అప్పుల భారాల్ని ఎందుకు తగ్గించలేక పోతున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.