Pratidhwani: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య ప్రమాణాలు ఎలా ఉన్నాయి? - నీతి ఆయోగ్ వివరాలపై ప్రతిధ్వని
Niti Aayog's health index: నీతి ఆయోగ్ 2020 ఆరోగ్య సూచీలో కేరళ రాష్ట్రం వరుసగా నాలుగో ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఒక పాయింట్ కోల్పోయి మూడు నుంచి నాలుగో స్థానానికి జారిపోగా... తెలంగాణ ఒక మెట్టు ఎక్కి నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. 43 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రూపొందించిన ఈ సూచిలో మాతాశిశు మరణాలు, లింగ నిష్పత్తి, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల సగటును నీతిఆయోగ్ ప్రధాన్యంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థల భాగస్వామ్యం ఎలా ఉంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.