Pratidhwani: అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతుల పరిస్థితి మారేది ఎప్పుడు? - Pratidhwani debate
Pratidhwani: రాష్ట్రంలో వానాకాలం పంటలకు రుణ పరిమితి ఖరారైంది. ఆయిల్‌పాం, మిర్చి, పసుపు పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రూ.5 వేల వరకు రుణపరిమితి పెంచిన బ్యాంకర్ల కమిటీ... పత్తి, వరికి మాత్రం రూ. రెండు వేలే పెంచింది. కూరగాయలు, పండ్ల పెంపకం వంటి పంటలకూ పెంపుదల అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో పంటల మార్పిడిపై రైతులకు ఆశలు కల్పిస్తున్న ప్రభుత్వం... ఉదారంగా పెట్టుబడి సాయం పెంచడంలో ఎందుకు సందేహిస్తోంది? బ్యాంకుల్లో చాలినంత రుణ సదుపాయం దొరకక రైతులు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి మారేది ఎప్పుడు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.