ప్రతిధ్వని: ప్రజల భావవ్యక్తీకరణకు భరోసా ఎలా? - Telangana news
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ అమలవుతున్నతీరుపై.. సుప్రీం కోర్టు విచారం వ్యక్తం చేసింది. అంతర్జాలంలో అభిప్రాయాలు ప్రకటించే స్వేచ్ఛను హరిస్తోందంటూ.. ఐటీ చట్టంలోని ఒక సెక్షన్‌ను సుప్రీం కోర్టు ఆరేళ్ల క్రితమే కొట్టేసింది. అయినా నేటికీ అదే సెక్షన్ ప్రకారం వేల సంఖ్యలో కేసులు నమోదవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు పత్రికా స్వేచ్ఛపై జరిగిన అంతర్జాతీయ సర్వేలోనూ భారత్ స్థానం అందనంత వెనకబడిపోయింది. దేశంలో ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు అసలు ప్రతిబంధకంగా నిలుస్తున్న అంశాలేంటి? చట్టాల అన్వయంలో నిర్లక్ష్యాలకు బాధ్యులు ఎవరు? ప్రజల భావవ్యక్తీకరణకు భరోసా ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.