Pratidhwani: రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ముందస్తుకు ఎంత వరకు సిద్ధంగా ఉన్నాయి..? - Debate on Early elections
Pratidhwani: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై వాడీవేడి చర్చ సాగుతోంది. ముందస్తుకు మేం సిద్ధం.. దమ్ముంటే తేదీ ప్రకటించాలని విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని.. అటు కాంగ్రెస్, ఇటు భాజపా ప్రకటించాయి. అయితే.. ఇదంతా రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అసలు ఈ ముందస్తు అంశం చర్చలోకి ఎందుకు వచ్చింది..? దాని వెనుక ఉద్దేశమేంటీ..? రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎంత వరకు సిద్ధంగా ఉన్నాయి..? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని..