Prathidwani: అంతర్జాతీయంగా భారత్ అనుసరిస్తున్న ఆర్థిక, వాణిజ్య విధానం ఏంటి? - international currency
Prathidwani: అంతర్జాతీయ మారకంగా అమెరికా డాలర్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అధికారం చెలాయిస్తోంది. ఈ ఏకపక్ష ధోరణిని మార్చేందుకు ప్రత్యామ్నాయ కరెన్సీల కోసం గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ఆశించిన మేరకు సఫలం కాలేదు. అనంతర పరిణామాల్లో కరెన్సీకి ప్రత్యామ్నాయంగా కొన్ని దేశాలు బంగారం, వెండి నిల్వలను పెంచుకుంటున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలోనూ డాలర్ మారకానికి బదులుగా ప్రత్యామ్నాయ విధానాలను తెరపైకి తెస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు భారత్ వద్ద ఉన్న డాలర్, ఇతర ఫారెక్స్ నిల్వలు ఎన్ని? అంతర్జాతీయంగా భారత్ అనుసరిస్తున్న ఆర్థిక, వాణిజ్య విధానం ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.