తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pratidhwani: రేషన్‌ బియ్యం అక్రమాలకు, మిల్లర్ల వ్యాపారానికి లింకు ఏంటి? - ts news

By

Published : Apr 22, 2022, 9:23 PM IST

Pratidhwani: రాష్ట్రంలో బియ్యం అక్రమాలు పౌర సరఫరాల సంస్థ పాలిట గుదిబండగా మారాయి. పూచీకత్తు లేకుండానే మిల్లర్లకు బియ్యం కేటాయింపులు చేస్తున్న అధికారులు.. సీఎంఆర్‌ వసూళ్ల విషయంలో చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా నెలనెలా కోట్ల రూపాయల వడ్డీ భారం మోయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక బియ్యం లెక్కల ఆడిటింగ్‌ నివేదికలు పంపలేదంటూ కేంద్రం వందల కోట్ల రూపాయలు ఆపేసింది. మరోవైపు మిల్లర్లు లెక్క చూపని బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతోందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణ నుంచి సీఎంఆర్‌ చెల్లింపుల వరకు మిల్లర్ల వ్యవహారశైలిలో పారదర్శకత ఉందా? సకాలంలో ధాన్యం సేకరించడంలో రాష్ట్రంపై ఉన్న బాధ్యత ఏంటి? మిల్లుల వద్ద నిరీక్షిస్తున్న రైతుల ధాన్యం సేకరణలో ఇబ్బందులు తొలగేదెప్పుడు? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details