Prathidwani: సహకార సంఘాలపై అజమాయిషీ, పర్యవేక్షణ ఎవరిది? - ప్రతిధ్వని చర్చ తాజా వార్తలు
సహకార సంఘాలపై అజమాయిషీ, పర్యవేక్షణ ఎవరిది..? ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమా లేక కేంద్రం పరిధిలోనిదా..? ఎంతోకాలంగా ఉన్న చిక్కు ప్రశ్న ఇది. ఇదే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది. 97వ రాజ్యాంగ సవరణ తీరును తప్పు పట్టింది. ఆ ఒక్కటే కాదు.. ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖపై తీవ్రమైన అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సహకార రంగంలో సంస్కరణలు అవసరమే అయినా.. వాటి దశ, దిశ ఎలా ఉండాలి? రాజకీయ ప్రమేయాలకు, ప్రయోజనాలకు దూరంగా సహకార వ్యవస్థ బలోపేతం ఎలా? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది.