Prathidwani: మాతృభాషలో ఇంజినీరింగ్ అమలులో సవాళ్లు ఏంటి? - ప్రతిధ్వని చర్చ
పుస్తకాల్లో ఉన్నది పూర్తిస్థాయిలో బుర్రకు ఎక్కించుకోవడానికి... మంచి విద్యావంతులు, నిపుణులుగా మారడానికి మాతృభాషను మించిన సాధనం లేదు. ఆలోచనాశక్తి విస్తృతం కావడానికి కూడా అదే ఉత్తమమార్గం. ఇదే విషయాన్ని ఏళ్లుగా విద్యావేత్తలు, మేధావులు బల్ల గుద్దిమరీ చెబుతున్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. దేశంలోనూ ఆ దిశగా కీలకమైన నిర్ణయం తీసుకుంది... కేంద్ర ప్రభుత్వం. దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా... స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. మరి... సంస్కరణల దిశగా ఇంజినీరింగ్ విద్యలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి? అమలులో ఎదురయ్యే సవాళ్లు ఏమైనా ఉన్నాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.