Prathidhwani: అసలేంటీ విద్యుత్ సంస్కరణల చట్టం.. దానిపై ఇంత వ్యతిరేకత ఎందుకు? - విద్యుత్ సవరణ చట్టాలపై కేంద్రం బిల్లు
Prathidhwani: విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేటు డిస్కంలకు ప్రవేశం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలతో కూడిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో దాన్ని ప్రభుత్వం పార్లమెంట్ స్థాయి సంఘానికి పంపింది. విద్యుత్ పంపిణీలో ప్రైవేటు కంపెనీల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలూ ఆందోళనలు చేపట్టాయి. ఈ బిల్లు చట్టంగా మారితే... సామాన్యులు, చిన్న పరిశ్రమలు, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటూ నిరసనలకు దిగారు. అసలు ఏంటీ ఈ విద్యుత్ సవరణల చట్టం? ఇందులో ఉన్న అంశాలేంటి? దానిపై ఇంత వ్యతిరేకత ఎందుకు? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.