TS Prathidhwani మూన్‌లైటింగ్ కొలువులపై యాజమాన్యాల వైఖరి ఏమిటి - Moonlighting
మూన్‌లైటింగ్! కొద్దిరోజులుగా ఐటీ పరిశ్రమలో ఈ మాట కేంద్రంగా దుమారం కొనసాగుతోంది. ఐటీ నిపుణులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయడంపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, నైతిక, చట్టపరమైన అంశాలపైనే ఇప్పుడు చర్చ అంతా. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఇప్పటికే తమ వద్ద అలాంటివి కుదరవని తేల్చి చెప్పేశాయి. విప్రో సంస్థ అయితే మరో అడుగు ముందుకు వేసి.. 300మంది ఉద్యోగులపై వేటు వేసింది. అసలు ఈ విషయం ఎందుకిలా చినికిచినికి గాలి వానగా మారుతోంది? మూన్‌లైటింగ్ కొలువులు, యాజమాన్యాల వైఖరిపై ఉద్యోగసంఘాల వైఖరి ఏమిటి? ఉద్యోగవిపణిలో ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీయనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.