తెలంగాణ

telangana

ETV Bharat / videos

Facebook Murder Case: ఫేస్‌బుక్‌ హత్య కేసులో బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్

By

Published : May 13, 2022, 12:14 PM IST

Facebook Murder Case: మీర్‌పేట్‌లో ఫేస్‌బుక్ పరిచయం... హత్యకు సంబంధించిన సీసీ దృశ్యాలు బయటికొచ్చాయి. పెళ్లి పేరుతో యశ్మ కుమార్ వేధిస్తుండటంతో శ్వేతారెడ్డి హత్యకు కుట్ర పన్నింది. ఈ క్రమంలో మరో ఫేస్‌బుక్ స్నేహితుడు అశోక్ సాయం తీసుకుంది. యశ్మకుమార్‌ను శ్వేతారెడ్డి.. ప్రశాంతి హిల్స్‌కు ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి 12గంటలకు పిలిపించింది. ముందస్తు కుట్ర ప్రకారం అశోక్, అతని స్నేహితుడు కార్తీక్ సమీపంలోనే మాటు వేశారు. ద్విచక్ర వాహనంపై వేచి ఉన్న యశ్మకుమార్‌ను సుత్తితో వెనక వైపు తలపై మూడు సార్లు అశోక్ కొట్టాడు. ఒక్కసారిగా యశ్మకుమార్ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత యశ్మకుమార్ చరవాణి కోసం వెతికి అక్కడినుంచి పారిపోయాడు. అటునుంచి వెళ్తున్న వాహనదారులు యశ్మకుమార్ ద్విచక్ర వాహనం నుంచి కిందపడిపోయాడని భావించారు. వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 6వ తేదీ సాయంత్రం మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశ్మకుమార్ పడిపోయిన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత దాడి విషయం బయటికి వచ్చింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు శ్వేతారెడ్డితో వివాహేతర సంబంధం, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన విషయం బయటికి వచ్చాయి. యశ్మకుమార్‌పై దాడి చేసి, అపస్మారక స్థితిలోకి వెళ్లాక... అతడి చరవాణి తీసుకెళ్లడానికి ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. తలపై సుత్తితో బలంగా బాదడంతో అంతర్గత గాయాలైన యశ్మకుమార్ మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details