డీజే టిల్లు పాటకు దుమ్ములేపిన ఎమ్మెల్యే రేగా.. - ts news
MLA Dance: ఏజెన్సీ ప్రాంతంలో వివాహ వేడుకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు డ్యాన్స్‌తో సందడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల, అల్లపల్లి మండలాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే.. తెరాస కార్యకర్త ఇంట్లో వివాహానికి హాజరయ్యారు. స్థానికుల కోరిక మేరకు పెళ్లిలో కాసేపు సరదాగా ఆడి సందడి చేశారు. నిత్యం పర్యటనలు అధికారులతో సమీక్షలు ప్రజాసమస్యలు ఉండే ఎమ్మెల్యే రేగా కాంతారావు.. రెండు రోజులపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గుండాల, అల్లపల్లి మండలాల్లో పర్యటిస్తున్నారు.