ప్రమాదమని తెలిసినా.. పొట్టకూటి కోసం మహిళా కూలీల సాహసం - kamareddy news
River cross problems: వాగు దాటేందుకు అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామ ప్రజలు పంట పొలాల్లో పనిచేయడానికి వాగు దాటేందుకు మహిళా కూలీలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాగుపై వంతెన లేకపోవడంతో చింతచెట్ల కొమ్మలు పట్టుకుంటూ నదిని దాటి ప్రమాదకరంగా దాటుతున్నారు. వాగునీటిలోనే పంట పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని మహిళలు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వాగు దాటుతున్నామని వాపోతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.