భద్రాచలాన్ని చుట్టుముట్టిన వరదనీరు.. డ్రోన్ దృశ్యాల్లో గోదావరి ఉగ్రరూపం - భద్రాద్రి వరదలు డ్రోన్ దృశ్యాలు
Flood Drone Visuals: భద్రాచలంలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు గోదావరిలో 60.80 అడుగులకు నీటిమట్టం చేరింది. భద్రాచలం వద్ద అధికారులు జారీ చేసిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నదిలో ప్రస్తుతం 18.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాద్రి రామాలయం అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. భద్రాచలం నుంచి ముంపు మండలాలకు 3 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయి ఉన్నాయి. దుమ్ముగూడెం మండలంలో ముంపునకు గురైన అనేక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే బస చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. గోదావరి తీవ్రతను తెలుసుకునేందుకు అధికారులు డ్రోన్ సాయం తీసుకున్నారు. అంతకంతకూ పెరుగుతున్న వరదనీటితో విశ్వరూపం చూపిస్తున్న గోదావరి ఉగ్రరూపాన్ని మీరు చూసేయండి.
Last Updated : Jul 14, 2022, 4:12 PM IST