చీపురు పట్టి స్కూల్ బాత్ రూం క్లీన్ చేసిన మంత్రి- వీడియో వైరల్ - బాత్ రూం క్లీన్ మంత్రి
ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో టాయిలెట్ల అపరిశుభ్రత గురించి వినే ఉంటారు. స్కూళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను సర్కారు ఎన్నిసార్లు ఆదేశించినా పెద్దగా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత విషయంలో ఆదర్శంగా నిలిచారో మంత్రి. ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలోని ఖైరా ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆ రాష్ట్ర పర్యటక మంత్రి జ్యోతి ప్రకాష్ పాణిగ్రాహి.. టాయిలెట్ క్లీన్‌గా లేదని తానే స్వయంగా రంగంలోకి దిగి చీపురు పట్టి క్లీన్ చేశారు. అయితే సాక్షాత్తు రాష్ట్ర మంత్రి బాత్ రూం క్లీన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.