దిల్లీ అల్లర్ల నిందితుడికి ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన జనం.. 4 గంటల పెరోల్కే! - దిల్లీ అల్లర్లు
Delhi Riots Accused Shahrukh Pathan: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన ఘర్షణల్లో.. పోలీసులపైకి తుపాకీ గురిపెట్టి జైలుకు వెళ్లిన నిందితుడు షారుఖ్ పఠాన్‌కు అపూర్వ స్వాగతం లభించడం కలకలం రేపింది. జైలులో ఉన్న పఠాన్‌కు అనారోగ్యంతో ఉన్న ఆయన తండ్రిని చూసేందుకు కోర్టు నాలుగు గంటల పెరోల్ మంజూరు చేసింది. పోలీసు భద్రత మధ్య సోమవారం పఠాన్.. ఈశాన్య దిల్లీలోని ఆయన ఇంటికిరాగా, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. మరికొందరు పఠాన్‌తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాల పట్ల భాజపా విమర్శలు గుప్పించింది.