కోరికలు తీర్చే రొట్టెల పండుగ.. మతసామరస్యానికి ప్రతీక - ఏపీ తాజా వార్తలు
Bara Shaheed Dargah Bread Festival: భక్తి విశ్వాసాలకు, మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే.. ఏపీ నెల్లూరు బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు దర్గాకు తరలివచ్చారు. 12 మంది అమరవీరుల సమాధులను దర్శించుకున్న భక్తులు.. స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలను ఇచ్చి పుచ్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బారాషాహితులను దర్శించుకుని రొట్టెలు పట్టుకుంటే తమ కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెప్తున్నారు. రొట్టెల పండుగకు సంబంధించిన మరిన్ని వివరాలు భక్తుల మాటల్లోనే..