భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇస్మార్ట్ భామ నబా నటేష్ - నబా నటేశ్
భద్రాద్రి రామయ్యను సినీనటి నబా నటేష్ దర్శించుకున్నారు. భద్రాచలంలోని కాసం వస్త్రాలయం ప్రారంభానికి వచ్చిన నబా నటేష్ అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని సీతారాములకు నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. నబాతో పాటు కాసం వస్త్రాలయం ఛైర్మన్ కాసం ఓం నమశ్శివాయ స్వామి వారిని దర్శించుకున్నారు.