రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఆటో నడిపిన డ్రైవర్, షాకిచ్చిన పోలీసులు - కుర్లా రైల్వే స్టేషన్
మహారాష్ట్రలో ఇటీవల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఆటో నడిపిన వ్యక్తిపై ముంబయి రైల్వే పోలీసులు చర్యలు తీసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రైల్వే కోర్టులో హాజరు పరచగా నిందితుడికి శిక్ష విధించినట్లు ట్వీట్ చేశారు. ఈ నెల 12న ఓ ఆటో డ్రైవర్ ముంబయిలోని కుర్లా రైల్వే స్టేషన్లోకి ఆటో తీసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా ప్లాట్‌ఫామ్‌పై నడిపాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడం వల్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.