మంచంపైనే బాలింత, నవజాత శిశువు.. పొలాల మధ్య నుంచి మోసుకెళ్తూ.. - రాజస్థాన్ న్యూస్
నవజాత శిశువుతో పాటు బాలింతను మంచంపై మోసుకొని వెళ్తున్న ఘటన రాజస్థాన్ జాలోర్‌లో జరిగింది. రౌతా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల.. ఆస్పత్రి నుంచి ఇంటికి పొలాల మధ్య నుంచి తీసుకెళ్లారు. రెండు రోజుల కింద ప్రసవానికై ఆస్పత్రికి సైతం పొలాల మధ్య నుంచే నడుచుకుంటూ వెళ్లింది గర్భిణి. గ్రామంలోని కొందరు రైతులు తమ పొలాలకు ఫెన్సింగ్ వేయడం వల్ల మరింత దూరం ప్రయాణించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల జిల్లా యంత్రాంగం స్పందించింది. శనివారం గ్రామానికి చేరుకున్న అధికారులు.. రోడ్డు పనులను ప్రారంభించారు.