నదిలో చిక్కుకున్న మహిళ, మూడేళ్ల చిన్నారి.. భారీ వరద ప్రవాహంలో గంటలపాటు.. - నదిలో చిక్కుకున్న మహిళ చిన్నారి
ఒడిశా రాయగడలో ఓ మహిళ తన మూడేళ్ల పాపతో సహా నదిలో చిక్కుకుపోయింది. సదర్ పరిధిలోని కుంభికోటలో ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారితో కలిసి నది దాటుతోంది. ఈ క్రమంలోనే నదీ ప్రవాహం అధికమవడం వల్ల మధ్యలోనే చిక్కుకుపోయింది. ఒక చేతితో పొదను పట్టుకోగా.. మరో చేత్తో మూడేళ్ల పాపను పట్టుకుని మూడు గంటల పాటు నదిలోనే ఉండిపోయింది. చివరకు తల్లి, చిన్నారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు గ్రామస్థులు.