కోతుల కోసం బ్రిడ్జ్ కట్టిన ప్రభుత్వం.. ఏం ఐడియా గురూ! - monkeys rescue video 2022 india
వరదల్లో చిక్కుకున్న కోతుల్ని రక్షించేందుకు ప్రత్యేకంగా ఓ వంతెన నిర్మించారు మహారాష్ట్ర నాగ్‌పుర్ జిల్లా అటవీ శాఖ అధికారులు. చాహు ప్రాంతాన్ని వర్షపు నీరు చుట్టుముట్టగా.. 7 కోతులు అక్కడున్న టవర్‌పైనే ఉండిపోయాయి. వరద నీటిని దాటుకుని బయటకు రాలేక, తిండి లేక అవస్థలు పడుతున్నాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. కోతులు తీరానికి చేరేందుకు వీలుగా 'హరిత సేతు' నిర్మించారు. కొందరు వాలంటీర్లు వీరికి సాయం అందించారు.