మృతదేహం వద్ద బోరున ఏడ్చిన కోతి.. 20 గంటలు పాటు అక్కడే ఉండి..
Monkey Cried Near Deadbody: సాధారణంగా కోతులు అల్లరి పనులు చేస్తాయి. గుళ్ల దగ్గర భక్తులను భయపెడతాయి. అప్పుడప్పుడు చెట్ల కొమ్మలపై అటుఇటూ దూకుతూ వింత చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి. కానీ తాజాగా కర్ణాటకలో ఓ కోతి చేసిన పని వైరల్గా మారింది. కల్బుర్గి జిల్లాకు చెందిన శ్యామల అనే మహిళ అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతదేహం ముందు కుటుంబసభ్యులు కూర్చుని రోదిస్తున్నారు. అదే సమయంలో ఓ కోతి అక్కడకు వచ్చి బోరున ఏడ్చింది. సుమారు 20 గంటలు పాటు అక్కడే కూర్చుంది. వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా కదలలేదు. దీంతో అంత్యక్రియలకు అంతరాయం ఏర్పడింది. భయాందోళనలకు గురైన గ్రామస్థులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి, కోతికి మత్తు మందు ఇచ్చి తీసుకెళ్లారు.