తెలంగాణ

telangana

ETV Bharat / videos

బ్రిడ్జ్​పై వేలాడుతూ.. కదులుతున్న ట్రైన్ నుంచి ఫోన్ చోరీ! షాకింగ్ వీడియో!! - మూవింగ్​ ట్రైన్​లో చోరో

By

Published : Jun 10, 2022, 1:36 PM IST

రైలు వంతెన దాటుతున్న సమయంలో మెట్లపై కూర్చుని వీడియో తీస్తున్న ప్రయాణికుడి నుంచి ఓ ఖతర్నాక్​ దొంగ రెప్పపాటులో ఫోన్ లాక్కున్నాడు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. కతిహార్ నుంచి పట్నా వెళ్తున్న ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​లో ఇద్దరు వ్యక్తులు మెట్లపై కూర్చుని గంగా నది వీడియో తీస్తున్నారు. ఆ సమయంలో రైలు బెగుసరాయ్ సమీపంలోని రాజేంద్రసేతు వంతెన దాటుతుంది. ఈ క్రమంలోనే వంతెనపై ఉన్న ఓ దొంగ ఒక్కసారిగా వారి నుంచి ఫొన్ లాక్కొన్నాడు. ఊహించని పరిణామంతో ప్రయాణికులిద్దరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బరౌనీ రైల్వే లైన్ పరిధిలో దొంగల ముఠా సంచరిస్తోందని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే ముఠాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో ఈ ముఠా పలు చోరీలకు పాల్పడిందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details