బంపర్ ఆఫర్.. రూ.54కే లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే? - రాజ్ ఠాక్రే పుట్టిన రోజు
అభిమాన నేత పుట్టిన రోజులకు కేక్‌లు కట్ చేయడం, అన్నదానాలు, రక్తదానాలు చేయడం చూశాం. కానీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ నాయకులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. తమ నాయకుడు రాజ్ ఠాక్రే 54వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని క్రాంతి చౌక్ బంక్‌లో రూ.54కే లీటర్ పెట్రోల్‌ను అందించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే పెట్రోల్ బంక్ వద్ద గుమిగూడారు. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.100 దాటిన నేపథ్యంలో ఇలా చేయడం వైరల్ అయింది.