తెలంగాణ

telangana

ETV Bharat / videos

రాష్ట్రానికి 8 పైసలివ్వని ప్రధానికి తెలంగాణ గౌరవం ఎందుకివ్వాలి..?: కేటీఆర్​ - telangana formation day

By

Published : Jun 2, 2022, 5:00 AM IST

KTR Comments on PM Modi: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానికి సీఎం కేసీఆర్​ ఉద్దేశపూర్వకంగానే స్వాగతం పలకలేదనే విమర్శలపై మంత్రి కేటీఆర్​ సమాధానమిచ్చారు. ఉత్త చేతులతో వస్తాం. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తామంటే.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి మండిపడ్డారు. కారణాలు ఏమైనప్పటికీ.. వారే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలప్పుడు ప్రధాని మోదీ భారత్​ బయోటెక్​ సందర్శనకు వచ్చారన్న మంత్రి కేటీఆర్​.. అప్పుడు పీఎం కార్యాలయం ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ఉత్తరం రాసిందన్నారు. అప్పుడు అవసరం లేని సీఎం ఇప్పుడెందుకు అని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రధాని 8సార్లు వచ్చారు.. కానీ 8 పైసలు తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వని ప్రధానమంత్రికి ఎందుకు గౌరవం ఇవ్వాలన్నారు. ఆయన గుజరాత్​కే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్​ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details