ఉస్మానియాలో అరుదైన సన్నివేశం.. హరీశ్ రావు, రాజాసింగ్ కలిసి లంచ్..
ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు ఎక్కుపెట్టే నేతలు కలిసి భోజనం చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. రోగి సహాయకులకు మూడు పూటలా 5రూపాయలకే భోజన వసతి కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ఉస్మానియా ఆసుపత్రిలో ప్రారంభించారు.ఈ సందర్భంగా రోగి సహాయకులకు స్వయంగా భోజనం వడ్డించిన మంత్రి.. తాను కూడా 5 రూపాయల భోజనాన్ని మంత్రి మహమూద్ అలీ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి తిన్నారు. భోజనం చేసేటప్పుడు ఎలా ఉందంటూ పలువురు మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందు భోజనం కోసం చాలా కష్టపడాల్సి వచ్చేదని మహిళలు మంత్రికి చెప్పారు. ఈ కార్యక్రమం తమ ఆకలి తీరుస్తుందని వారు వెల్లడించారు.