అభిమానాన్ని సాగు చేసిన మెగాఫ్యాన్.. రాంచరణ్ ఫిదా.. - రాంచరణ్ ముఖచిత్రంతో వరిసాగు
సినీ తారలను అభిమానించే వాళ్లు చాలా మంది ఉంటారు. అభిమాన తారలపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. తాజాగా మెగాపవర్‌స్టార్ రాంచరణ్ కోసం జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతానికి చెందిన జైరాజ్ అనే యువకుడు వినూత్న పద్ధతిలో తన అభిమానాన్ని చూపించాడు. అర ఎకరం పొలం కౌలుకు తీసుకొని రామ్‌చరణ్ ముఖచిత్రం ఆకారంలో వరిసాగు చేశాడు. అందులో పండిన ధాన్యంలో రెండు బస్తాల బియ్యాన్ని చరణ్‌కు కానుకగా ఇచ్చాడు. ఇందుకోసం.. 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరణ్‌ను కలుసుకున్నాడు. జైరాజ్ చేసిన కృషిని తెలుసుకున్న చరణ్.. అభినందించటమే కాకుండా స్వయంగా తన ఇంటికి ఆహ్వానించాడు. జైరాజ్‌తో 45 నిమిషాలు మాట్లాడాడు. తల్లిదండ్రులు లేని జైరాజ్ ప్రతిభ ప్రశంసించిన చరణ్.. చిత్ర పరిశ్రమలో మంచి పని కల్పిస్తానని హామీ ఇచ్చాడు.