bogata waterfall: ప్రకృతి ప్రేమికులను రారమ్మంటున్న బొగత జలపాతం - mulugu news
bogata waterfall: రాళ్లపై పరవళ్లు తొక్కుతున్న జలధార.. ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం సందర్శకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో పరిసరాలు కోలాహలంగా మారాయి. కొలనులో స్నానాలు చేసేందుకు అధికారులు అనుమతించడంతో వరద నీటిలో సరదాగా గడుపుతున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న జలధార చూసి ప్రకృతి ప్రేమికులు మంత్రముగ్ధులవుతున్నారు.