నదిలో బోల్తా పడ్డ బస్సు.. లోపల 50 మంది ప్రయాణికులు.. ఆరుగురు మృతి - బస్సు ప్రమాదం
ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో దారుణం జరిగింది. దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి పడటం వల్ల ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గిర్‌దిహ్ నుంచి రాంచీ వెళ్తున్న బస్సు తతిజారియాలో సివాన్నే నదిపై గల వంతెన రెయిలింగ్‌ను ఢీకొని కింద పడటం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ రతన్‌చోతే తెలిపారు. బస్సులో మరికొంత మంది ప్రయాణికులు చిక్కుకున్నందున సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నది మధ్యలో బస్సు పడి ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని పోలీసు సూపరింటెండెంట్ రతన్‌చోతే తెలిపారు.