జేసీబీతో ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు! - atm theft
Thieves Broke ATM: మహారాష్ట్ర సాంగ్లీలో షాకింగ్ ఘటన జరిగింది. దొంగలు ఏకంగా జేసీబీతో లోపలికి ప్రవేశించి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. ఏటీఎం యంత్రాన్ని పెకిలించి.. బయటకు తీసుకెళ్లారు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మిరాజ్ తాలూకా అరగ్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిందీ ఘటన. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను వెతికే పనిలో ఉన్నారు.
Last Updated : Apr 24, 2022, 6:21 PM IST