దాహం తీర్చుకునేందుకు మృగరాజుల పాట్లు.. పొలాల్లోకి వచ్చి - సింహాల వైరల్ వీడియో
Lion viral video: మండేవేసవితో జంతువులకు కూడా ఇక్కట్లు తప్పట్లేదు. దాహం తీర్చుకునేందుకు అడవి నుంచి జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. సింహాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి కోసం పొలాల వద్దకు వచ్చి దాహం తీర్చుకుని మళ్లీ అడవిలోకి వెళ్లిపోయాయి ఐదు సింహాలు. గుజరాత్లోని అమ్రేలీ జిల్లా బృహద్ గిర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ సింహాలు రోడ్డు దాటుతుండగా స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.