మక్కా క్లాక్ టవర్‌పై పిడుగు.. లక్షలాది వ్యూస్‌తో వీడియో వైరల్ - makkah clocktower lightning
సౌదీ అరేబియా మక్కాలోని ప్రఖ్యాత క్లాక్ టవర్‌పై పిడుగు పడిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఓ రోజు సాయంత్రం వర్షం కురుస్తుండగా బుర్జ్ అల్ సా గడియార స్తంభంపై భారీ పిడుగు పడి.. నగరమంతా ఒక్కసారిగా మెరిసిపోయిన వీడియోను ట్విట్టర్లో ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది వీక్షించారు. జెడ్డాలోని కింగ్ అబ్దుల్అజీజ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్రం చదువుతున్న ముల్హాం హెచ్ అనే వ్యక్తి శుక్రవారం ఈ వీడియో షేర్ చేశారు.