నగరంలో వస్త్రాభరణాల ప్రదర్శన - Life_Style_Expo
ఆధునిక, సంప్రదాయ మేళవింపుతో కూడిన వస్త్రాభరణాల ప్రదర్శన నగరంలో ఏర్పాటైంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ట్రెండ్జ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన పలువురు మహిళలు, యువతుల రాకతో సందడిగా మారింది. దేశంలోని వివిధ నగరాలకు చెందిన మహిళ వ్యాపారవేత్తులు, డిజైనర్లు ఒకే వేదికపై తమ ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. ఇందులో లేహంగాస్, డిజైనర్ చీరలు, జ్యూయలరీ, యాక్సెసిరీస్‌తో పాటు మగువలకు కావాల్సిన అన్నీ రకాలైన వస్త్రాభరణాలు ఒకే వేదికపై ఏర్పాటు చేశారు.