తెలంగాణ

telangana

ETV Bharat / videos

చిరుత పిల్లలకు బాటిల్​తో నీళ్లు.. దగ్గర్లోనే తల్లి.. చివరకు.. - leopard cub video

By

Published : May 17, 2022, 5:17 PM IST

మండే వేసవిలో, దట్టమైన అడవిలో దాహంతో విలవిల్లాడుతున్న చిరుత పిల్లల కోసం సాహసం చేశారు అటవీ శాఖ ఉద్యోగి అశోక్​ ఘులే. తల్లి చిరుత వచ్చే ప్రమాదమున్నా.. ఆ కూనలకు జాగ్రత్తగా సీసాతో నీళ్లు తాగించారు. మహారాష్ట్ర అహ్మద్​నగర్​ జిల్లా అకోలే మండలం టక్లీ గ్రామం వద్ద జరిగిందీ ఘటన. అడవిలో గోతులు తవ్వుతుండగా.. చిరుత కూనల అరుపులు వినిపించగా.. అశోక్ వాటి దగ్గరకు వెళ్లారు. ఫారెస్ట్ రేంజర్​కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన సూచన మేరకు వాటర్ బాటిల్​తో చిరుత పిల్లల దాహం తీర్చారు. ఈ వీడియో వైరల్ కాగా.. జంతు ప్రేమికులు, తోటి ఉద్యోగులు అశోక్​పై ప్రశంసలు కురిపించారు. గతంలో.. బావుల్లో పడ్డ చిరుతల్ని కాపాడడంలో తన వంతు పాత్ర పోషించారు అశోక్.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details