వేటకు చిరుత రెస్ట్.. అడుగు దూరంలోనే జింకలు ఉన్నా.. - జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ చిరుత, రెండు జింకలు పక్కపక్కనే నిల్చోని నీరు తాగాయి. అప్పటికే చిరుత, ఓ జింక కొలను వద్దకు చేరుకుని నీరు తాగుతుండగా మరో జింక అక్కడకు వచ్చింది. కళ్ల ముందే వేటాడేందుకు ఆహారం ఉన్నా.. జింకలపై చిరుత ఎలాంటి దాడి చేయలేదు. అయితే దీనిపై స్పందించిన అక్కడి అధికారులు.. ఇటువంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు అన్నారు. చిరుత ఆకలితో లేనప్పుడు వేటాడదని.. కేవలం ఆహారం అవసరమైనప్పుడు మాత్రమే దాడి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.