చనిపోయినట్టు నటించి చిరుతకు షాకిచ్చిన శునకం - కర్ణాటక న్యూస్
కర్ణాటక ఉడుపిలో ఇంటి బయట నిద్రిస్తున్న ఓ శునకం చిరుత దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. చిరుతతో విరోచితంగా పోరాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి మరణించినట్లు నటించింది. తద్వారా ప్రాణాలను కాపాడుకుంది. కుక్క మొరగడం వల్ల యజమాని బయటకు వచ్చి చూశారు. దీంతో చిరుత అక్కడినుంచి పరారయ్యింది. కుక్కకు స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Aug 14, 2022, 12:36 PM IST