తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాయింట్​ వచ్చినా.. ప్రాణం పోయింది.. కబడ్డీ ఆడుతూ క్రీడాకారుడు మృతి - కబడ్డీ ఆడుతూ మరణించిన క్రీడాకారుడు

By

Published : Jul 25, 2022, 8:16 PM IST

కబడ్డీ ఆడుతూ క్రీడాకారుడు మృతిచెందిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఆదివారం జరిగింది. పురంగని గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు విమల్​(26).. మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. రైడ్ కోసం వెళ్లిన విమల్​.. రెండు పాయింట్లు తీసుకువచ్చాడు. లైన్​ను టచ్​ చేసిన అనంతరం లేవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అప్రమత్తమైన తోటి ఆటగాళ్లు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. విమల్​ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని విల్లుపురం వైద్య కళాశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details