అతివల హొయలు... నగల సోయగాలు - gold ornaments fashion show
ధగధగ మెరిసే పసిడికాంతుల్లో మెరుపు తీగలాంటి సుందరీమణులు తళుక్కున మెరిసేశారు. విభిన్న డిజైన్ల బంగారు ఆభరణాలను ధరించి క్యాట్‌వాక్‌తో అదరహో అనిపించారు. అతివల పసిడి మేనిఛాయకు... పుత్తడికి జరుగుతున్న పోటీలా ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. భాగ్యనగరంలోని ఓ నగల దుకాణంలో నిర్వహించిన కార్యక్రమం ఈ ప్రదర్శనకు వేదికైంది.