పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వీడియో వైరల్! - బిహార్ ఎమ్మెల్యే డాన్స్
ఓ వివాహ వేడుకలో బిహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ తన నృత్యంతో సందడి చేశారు. సన్నిహితుల పెళ్లికి వెళ్లిన ఆయన బాలీవుడ్ పాటకు అదిరిపోయే నృత్యం చేశారు. 'యో హోసనాకా బల్ హై' అనే పాటకు తగ్గట్టు స్టెప్పులు వేసి అక్కడి వారిని అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఓ కార్యక్రమంలో గోపాల్ మండల్ 'దిల్లీ వాలీ గర్ల్‌ఫ్రెండ్ ఛోడ్ చడ్ కే..' పాటకు డ్యాన్స్ చేసి అలరించారు.